హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు.
బెలూన్ నుంచి కిందకి దూకిన వ్యక్తి అధికారులకు చెప్పగా గాలింపు చర్యలు చేపట్టారు. హు దగ్గర సెల్ ఉడడంతో ఆయనకు ఫోన్ చేసి కిందకు ఎలా దిగాలో సూచించారు. రెండో రోజు సుమారు 320 కిలోమీటర్లు ప్రాయాణించిన తర్వాత హు రష్యా సరిహద్దులో కిందకి దిగాడు. హును ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. 2 రోజులు గాల్లో ఉడడంతో బాక్ పెయిన్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోలుకుంటున్న హు తన పూర్తి వివరాలు వెల్లడించలేదు.