Home / Tag Archives: it minister of telangana

Tag Archives: it minister of telangana

అర్హులైన ప్రతి కుటుంబానికి దళితబంధు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కొత్తగా వివాహం అయినవారికి కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. అకౌంట్లలో పడిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులతోపాటు 65 ఏళ్లలోపు ఉన్న …

Read More »

యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు టీఎస్‌ఐసీ ద్వారా ప్రభుత్వం కృషి

యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్‌ థింకింగ్‌, ప్రాబ్లం సాల్వింగ్‌ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్‌ ఎడిషన్‌లో భాగం గా టీఎస్‌ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్‌, యువా, ఇంక్విల్యాబ్‌ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను …

Read More »

ఐటీ నియామకాల్లో హైదరాబాద్‌ కు రెండోస్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్సీఆర్‌), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్‌ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్‌, పుణె నగరాలు చెరో 18 శాతంతో …

Read More »

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్‌ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ్ణ హోటల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు …

Read More »

చేనేత రంగానికి రూ.73.42 కోట్లు విడుదల

చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్‌ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్‌ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్‌ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష …

Read More »

స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

క్యాన్సర్‌ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్‌ హాస్పిస్‌’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్‌ బంజారాహిల్స్‌ సారథ్యంలో అక్కడి రోడ్‌ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్‌ …

Read More »

కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి-మంత్రి కేటీఆర్

కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్‌ హాస్పిస్‌ అన్నారు. క్యాన్సర్‌ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ భవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్‌ హాస్పిస్‌ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్‌ కేర్‌ అంటే …

Read More »

KBC: కేబీసీలో ప్ర‌శ్న‌గా మంత్రి కేటీఆర్ ట్వీట్‌..

కొన్ని సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు ఎంద‌రో హాజ‌ర‌య్యారు. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్స్ వీరేంద్ర సెహ్వాగ్‌, సౌర‌వ్ గంగూలీ హాజ‌ర‌య్యారు. వీరికి అమితాబ్‌.. కేటీఆర్ గ‌తంలో చేసిన ట్వీట్‌ని ప్ర‌శ్న‌గా అడిగారు. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ …

Read More »

త్వరలోనే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు …

Read More »

పరిశ్రమల శాఖ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష

పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు టి ఎస్ ఐఐసి కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని …

Read More »