తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించారు.
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు. అంటే రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
Read More »అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన తెలంగాణ సర్కారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఏడాది ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో వైద్యారోగ్యం పంచాయతీ రాజ్ శాఖలకు ముప్పై నాలుగు శాతం అధికంగా ఖర్చు పెట్టినట్లు..గృహ నిర్మాణం పరిశ్రమల శాఖలకు కేటాయింపులకంటే తక్కువగా ఖర్చు చేసినట్లు తెలిపింది. వంద రోజుల పాటు రూ ఇరవై రెండు వేల …
Read More »మాజీ తుమ్మలను కలిసిన రైతులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి రైతులు శనివారం ఉదయం గండుగులపల్లి లోని తుమ్మల గారి నివాసంలో మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారిని మన్యం అప్పారావు, ఊకే చందర్రావు గార్ల ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా దమ్మపేట రెవెన్యూ మోజాలోని 1458 సర్వే నంబర్ లో గల భూములకు నూతన పాస్ పుస్తకాలు అందకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, …
Read More »ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …
Read More »తెలంగాణ మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది …
Read More »మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న …
Read More »తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే …
Read More »కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్ 27) సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ …
Read More »