తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యంలో అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని పేర్కొన్నారు.
ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యం అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో;
ఈరోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం
జై తెలంగాణ ✊ pic.twitter.com/jcmWb85qzT
— KTR (@KTRTRS) September 27, 2022