తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు.
యాదాద్రి ఆలయ పున: ప్రారంభం తర్వాత సౌకర్యాలు మెరుగు పడ్డాయని, అక్కడక్కడ చిన్న సమస్యలు ఉన్న వాటిని మరింత మెరుగు పరుస్తామని తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు మరిన్ని కాటేజీలు నిర్మిస్తామని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.