తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్ సార్కు నివాళులు అర్పించారు.