తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో సాగు జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ముసురును సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఆ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరుఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను ముఖ్యమంత్రి కోరారు.ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాల దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ …
Read More »మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా
తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు. ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ …
Read More »సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ ట్వీట్… స్పందించిన కేటీఆర్…!
ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిలా నిలుస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రతి రోజు ట్విట్టర్‌లో కేటీఆర్ సాయం కోరుతూ ఎన్నో ట్వీట్లు వస్తుంటాయి. వాటికి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ వారికి కావల్సిన సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా సౌదీ అరేబియా నుంచి ఓ మహిళ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది. మా నాన్న చనిపోయారు. ఇండియా రావాలనుంది. నాకు మీ సహకారం కావాలి’అంటూ రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌లోని భూపే ష్‌గుప్తా నగర్‌కు …
Read More »సిద్ధార్థ స్నేహపూర్వకమైన వ్యక్తి.. కేటీఆర్
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు తనను షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ.. మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో పడి ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతదేహాన్ని ఇవాళ ఉదయం జాలర్లు గుర్తించారు. సిద్ధార్థ చనిపోయిన తీరు తనను బాధకు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. …
Read More »సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన.. పైనుండి వస్తున్న వరదల వలన ఆల్మట్టి,నారాయణ్ పూర్ నుంచి కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి.దీనివలన జూరాల నిండిన వెంటనే నెట్టెంపాడు,బీమా,కోయిల్ సాగర్ లిప్టులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీచేశారు. భారీగా వరద వచ్చే అవకాశమున్నందున పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం …
Read More »దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నారై అమెరికాలోని టెక్సాస్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ వెంకటేశ్ కులకర్ణి కుమారుడైన శ్రీనివాస్ కులకర్ణి హైదరాబాద్‌లోఎన్నారై కుటుంబసభ్యులను కలిసి మద్దతునివ్వాలని కోరారు. ఆయన ముంబై, బెంగళూరు, చెన్త్నె, తిరుపతి నగరాల్లో ప్రచారం చేస్తూ, హైదరాబాద్ నగరానికి వచ్చి శుక్రవారంనుంచి మూ డ్రోజులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ …
Read More »తెలంగాణలో ఐఐఐటీ క్యాంపస్
తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో …
Read More »తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం
తెలంగాణ పర్యాటక శాఖ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్” దక్షిణాసియాలోనే నెంబర్ వన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ గా నిలిచి, ఐదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ – 2019 ను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. 5 వ ఎడిషన్ ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ – …
Read More »తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …
Read More »