ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మరో భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో కీలక సీనియర్ నేత కౌశిక్ హరి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆల్రెడీ ప్రగతిభవన్ లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన కౌశిక్ హరి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో రామగుండంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అనుచరులతో కలిసి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా …
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …
Read More »ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత
ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More »బీజేపీ సీనియర్ నాయకుడు మృతి
బీజేపీ సీనియర్ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్ వికాస్ ఫౌండేషన్‌లో కూడా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి …
Read More »గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అల్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ నరసింహారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
Read More »సీపీఐ సీనియర్ నేత మృతి
సీపీఐ సీనియర్ నాయకులు, ఆ పార్టీ కంట్రోల్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం.నారాయణ (81) శనివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎం.నారాయణ మృతి పట్ల సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ …
Read More »బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »