Home / SLIDER / గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు మృతి

గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు మృతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అల్వాల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నరసింహారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు.

విషయం తెలుసుకున్న మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.

అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ నరసింహారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.