ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »తెలంగాణలో మరో కొత్త పథకం
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం కోసం ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం అందించనున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గంగుల ఫైల్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి నెల 35,700 అంగన్వాడీ కేంద్రాలకు 2121 టన్నుల సన్న బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 5.25లక్షల మంది చిన్నారులకు, 3.75లక్షల మంది గర్భిణులు, బాలింతలకు చేకూరనుంది.
Read More »పుష్ప -2 మరో రికార్డు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ ప్రధాన పాత్రలుగా నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి వరల్డ్ వైడ్ గా ఘన విజయం సాధించిన మూవీ పుష్ప . ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురుచేస్తున్నారు. …
Read More »ఐపీఎల్ లో చెత్త రికార్డు
తాజా ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో ముంబై బౌలర్ ఆర్చర్ దారుణంగా విఫలమయ్యారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 3 సిక్సులతో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు ఇవ్వడం ఆర్చర్క ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును ఆర్చర్ మూటగట్టుకున్నాడు. బెహండార్ఫ్ ను కాదని …
Read More »గీత వృత్తి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి
ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందించడం ద్వారా గీత వృత్తిదారులకు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ గౌడ సంఘం అధ్యక్షులు నక్క మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గౌడన్నలు పాలాభిషేకం చేశారు. …
Read More »దేశంలో కొత్తగా మూడు వేల కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,82,294 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,962 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 36,244 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల్లో …
Read More »పేద కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్
పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు గురువారం నాడు మధిర పట్టణం 13 వ వార్డ్ లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు …
Read More »ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
తెలంగాణలో ఇకపై రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లకుండానే ఆర్ట్స్ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చదవాలనుకునేవారికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అద్భుత అవకాశం కల్పించింది. ఆయా అభ్యర్థులు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఆ తరువాత పరీక్ష ఫీజు చెల్లించి ఇంటర్ పరీక్షలు రాయొచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఇలాంటి విద్యార్థులు ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా …
Read More »చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్టు …
Read More »నేడే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నది.జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన ‘తెలంగాణ భవన్’ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఢిల్లీలో చెరిగిపోని మన దస్కత్. ఇది తెలంగాణ దఫ్తర్. సంకల్పబలం సమృద్ధిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది తలపెట్టినా విజయం …
Read More »