Home / SLIDER / నేడే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం

నేడే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం

దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నది.జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీ వసంత్‌విహార్‌లో నిర్మించిన ‘తెలంగాణ భవన్‌’ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఢిల్లీలో చెరిగిపోని మన దస్కత్‌. ఇది తెలంగాణ దఫ్తర్‌. సంకల్పబలం సమృద్ధిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది తలపెట్టినా విజయం తథ్యం. తొమ్మిదేండ్ల చరిత్రే ఇందుకు సాక్ష్యం. తెలంగాణ మాడల్‌ను ముందుపెట్టి దేశ తలరాతను మార్చే దిశగా జైత్రయాత్రకు గులాబీ సేన సిద్ధమైన తరుణంలో.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నేడు ఢిల్లీలో కార్యాలయం ప్రారంభం కానున్నది.

బీఆర్‌ఎస్‌ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్నది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా ఉరకలేస్తున్న ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సగ్వరంగా ప్రారంభించుకుంటున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు ఏర్పాటుచేసిన యాగశాల, సుదర్శనపూజ, హోమం, వాస్తుపూజల్లో పాల్గొంటారు. ముహూర్తానికి కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి అంతస్థులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ సమావేశపు హాలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో దాదాపు గంటసేపు తొలి సమావేశం నిర్వహించనున్నారు.

పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌, కార్పొరేషన్ల చైర్మన్లు కోలేటి దామోదర్‌, దూదిమెట్ల బాలరాజుయాదవ్‌, ఒడపల్లి మాధవ్‌ తదితరులు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ ప్రారంభోత్స నేపథ్యంలో వసంత్‌విహార్‌ సమీప రోడ్లు, అశోక్‌రోడ్డు, తెలంగాణభవన్‌ పరిసరాల్లో కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆయా ప్రాంతాలన్నీ గులాబీమయమై కొత్త శోభను సంతరించుకున్నాయి. నూతన కార్యాలయంలో పార్టీ అధినేత చాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌తోపాటు ప్రత్యేక గదులన్నింటినీ పూలతో అలంకరించారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇప్పటికే కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

నాడు టీఆర్‌ఎస్‌ ఉద్యమ కార్యాచరణకు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌ వేదికగా నిలిచింది. 2006 ఆగస్టు 14న హైదరాబాద్‌ తెలంగాణభవన్‌ ప్రారంభోత్సవం చేసుకోగా అప్పటినుంచి ఉద్యమ కార్యాచరణ అంతా ఇక్కడి నుంచే సాగింది. తెలంగాణభవన్‌లో జరిగిన విస్తృత మేధోమథనం వెలుగులోనే యూపీఏ1 ప్రభుత్వంలోని మంత్రి పదవులకు అప్పటి ఉద్యమ సారధి కేసీఆర్‌తోపాటు మరో మంత్రి ఆలె నరేంద్ర రాజీనామా చేశారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దాకా తెలంగాణభవన్‌ అవిశ్రాంత ఉద్యమ నిర్మాణానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. 17 ఏండ్ల క్రితం నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం (తెలంగాణభవన్‌) ఉద్యమ సమయంలో తెలంగాణ వాదానికి కేంద్రబిందువుగా ఏవిధంగా మారిందో అదే స్ఫూర్తిని ఇప్పుడు ఢిల్లీ వసంతవిహార్‌ రగిలించనున్నది.

బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలను తన వెంట తిప్పుకునేలా ఢిల్లీ పార్టీ కార్యాలయం వేదికగా మారుతుందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం విజయదశమినాడు (2022 అక్టోబర్‌ 5) టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన మరుక్షణం నుంచే దేశ రాజకీయాల్లో పెను ప్రభావాన్ని చూపుతున్నది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి ముందే కేసీఆర్‌ దేశంలోని అన్ని వర్గాల మేధావులు, ఉద్యమకారులు, రైతు సంఘాల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపారు. తెలంగాణలో సాధించిన వ్యవసాయ నమూనాను దేశవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పాన్ని రైతు నాయకులకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదానికి అంకురార్పణ జరిగింది. ఈ నినాదానికి ఆకర్షితులై వివిధ రాష్ర్టాల నుంచి అనేకమంది ప్రముఖులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నా రు. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా, పంజాబ్‌ తదితర రాష్ర్టాల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో అనతికాలంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భవిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ విస్తరణకు, గుణాత్మక మార్పు కోసం జరిగే కార్యాచరణకు ఢిల్లీలోని బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం వేదిక కానున్నది.

ముఖ్యమంత్రి కీసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వివిధ రంగాల్లో నంబర్‌ వన్‌గా నిలిచి దేశానికి దిక్సూచిగా మారిందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత అన్నారు. దేశంలో రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ నిలబడ్డారని కొనియాడారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో రానున్న కాలంలో దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.

దేశ సమగ్రతా వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందని రోడ్లు, భవానాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రామాణికమైన వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించిన కార్యాలయాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభిస్తారని తెలిపారు. పార్టీ ఆఫీసులో 40 మందితో సమావేశం నిర్వహించేందుకు వీలుగా హాలు, పార్టీ ముఖ్యులు, నేతలకు అవసరమైన విధంగా గదులు నిర్మించినట్టు వివరించారు.

ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని కేసీఆర్‌ 2004లోనే ఆలోచించారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రాంతీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు. ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే ఆ పార్టీకి కనీసం ఐదుగురు ఎంపీలు ఉండాలి. ఐదుగురు ఎంపీలు ఉంటే 500 చదరపు గజాలు, 15 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీకి 1,000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. బీఆర్‌ఎస్‌కు 2004లో ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో కేసీఆర్‌ ఆ సమయంలో కార్యాలయం కోసం స్థలం ఎంపికను వాయిదావేశారు. పార్టీకి ప్రస్తుతం 16 మంది ఎంపీలు ఉన్నారు. వెయ్యి గజాల స్థలం కేటాయించడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు స్థలాలను పరిశీలించిన అనంతరం వసంత్‌విహార్‌లో ఎంపిక చేశారు. టీఆర్‌ఎస్‌గా పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించుకోగా బీఆర్‌ఎస్‌గా కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం విశేషం. భూమిపూజ జరిగిన 29 నెలల్లోనే కార్యాలయ నిర్మాణం పూర్తవ్వడం మరో విశేషం.

జనవరి 7, 2019: ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించాలని ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం వినతిపత్రం అందజేసింది.
అక్టోబర్‌ 9, 2020: ఢిల్లీలోని వసంతవిహార్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ దీన్‌దయాళ్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
నవంబర్‌ 4, 2020: రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి భూమిపత్రాలు అందజేశారు.
సెప్టెంబర్‌ 2, 2021: పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాలయ భవనానికి భూమిపూజ చేశారు.
డిసెంబర్‌ 14, 2022: నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు.
మే 4, 2023: పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

స్థలం : వసంతవిహార్‌
విస్తీర్ణం: 1100 చదరపు మీటర్లు (1327 చదరపు గజాలు)
స్థలానికి :బీఆర్‌ఎస్‌ పార్టీ చెల్లించిన మొత్తం: రూ. 8.64 కోట్లు
భవనం: జీ ప్లస్‌ త్రీ
నిర్మాణ విస్తీర్ణం: 22,300 చదరపు అడుగులు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat