రుణాలపై ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాదికి 8.5% వడ్డీ రేటుతో గృహరుణాలు ఇస్తామని తెలిపింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. MSME రుణాలు కూడా 8.4% వడ్డీకే ఇస్తామని పేర్కొంది. మార్చి 31 వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని BOB వివరించింది.
Read More »కోవిడ్ వల్ల అంత ముప్పు ఉందా..?
ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కోవిడ్ తగ్గుముఖం పట్టింది. అయితే దాని ప్రభావం ప్రజలను వేధిస్తోంది. దీర్ఘకాల కోవిడ్ తో బాధపడుతున్న 59 శాతం మందిలో శరీరంలోని ఏదోఒక అవయవం దెబ్బతింటోందని బ్రిటన్ సైంటిస్టులు అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకినప్పటికీ ఇబ్బందులు పడనివారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ను బెదిరించిన వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. తనను చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 506 సెక్షన్ కింద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు …
Read More »సునీల్ గవాస్కర్ రికార్డుకు నేటికి 36 ఏళ్లు
టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు. ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా
ఏపీలో పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. నారా లోకేశ్ కు సంఘీభావం తెలిపారు. అయితే కొన్ని రోజులుగా రాధా జనసేనలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన లోకేశ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధా టీడీపీలోనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Read More »వారందరికీ ధన్యవాదాలు-హీరో శర్వానంద్
తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా హీరో శర్వానంద్ తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒకే ఒక జీవితం సినిమాకి అంకితం. తాను 20 ఏళ్ల కిందట శ్రీకారం చుట్టిన సినీ ప్రస్థానం మరుపురానిది. సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం రన్ రాజా రన్లా పరుగులు తీస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరిచ్చే ఆశీస్సులతోనే ఇది …
Read More »పార్టీ చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ
తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు సోమవారం రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో చర్చించి ఈనెలలోనే తన నిర్ణయం చెబుతానన్నారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. కాగా మాజీ ఎంపీ …
Read More »సచిన్ పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ .. లెజండ్రీ ఆటగాడు.. సచిన్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదు.. కానీ కెప్టెన్ గా నిరూపించుకోలేకపోయాడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. అతను ఫెయిల్డ్ కెప్టెన్ అని వ్యాఖ్యానించారు. కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మరింత బాగా ఆడాడని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు కోహ్లి కూడా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాక పరుగులు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో సచిన్ మాదిరే జట్టు …
Read More »