Home / Tag Archives: slider (page 290)

Tag Archives: slider

డొనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దాడులు చేసింది. ఫ్లోరిడాలోని తన ఇల్లు ప్రస్తుతం FBI ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ తెలిపారు. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. అయితే సోదాల విషయం తెలిసి ట్రంప్ పలు కీలక డాక్యుమెంట్లను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Read More »

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై స్వప్నా సురేష్‌ సంచలన ఆరోపణలు

 కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్‌.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పట్టుబడ్డ ఓ వ్యక్తి తప్పించుకునేందుకు సీఎం సహాయమందించారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. భారత్‌లో నిషేధించిన తురయా శాటిలైట్‌ ఫోన్‌తో యూఏఈ జాతీయుడిని 2017లో కొచ్చిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారని, అతడిని చట్టం నుంచి తప్పించేందుకు విజయన్‌ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన …

Read More »

మళ్లీ వార్తల్లోకి YCP Mp RRR

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని రాజధానిగా కదిలించలేరని ఆ పార్టీకి చెందిన  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని ప్రస్తావించనే లేదని అన్నారు. మాతృభాషలో విద్యాబోధన చేయాలని కేంద్రం చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే పనిలో …

Read More »

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు మంత్రి హరీష్ రావు లేఖ

 కొవిడ్‌ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి రెండు రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు మంగళవారం హరీశ్‌రావుకు కేంద్రమంత్రికి లేఖ రాశారు.కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ 106శాతం సాధించిందని, రెండో …

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇందులో 4,35,16,071 మంది కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు.ప్రస్తుతం దేశంలో 1,31,807 …

Read More »

జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మెన్ రోజా రమణి శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ చైర్మెన్ ఒంటేరు ప్రతాప రెడ్డి, గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికీ …

Read More »

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నేత ..పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి   మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెళ్లారు.. ఈక్రమంలో మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఆయన కుటుంబాన్ని …

Read More »

మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ

బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16,167 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే 15,549 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,35,510కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.50 శాతానికి చేరింది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ల పంపిణీ 206.56 కోట్లకు చేరింది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat