తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,217 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్ల సర్వీసులను రెన్యువల్ చేశారు. 2022, మే 31 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రెన్యువల్ అయిన వారిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. కాగా, సర్కారు నిర్ణయం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Read More »కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఆలయ EO ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 473 33 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read More »ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్ను
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్నేశాడు. సౌతాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 22 ఇన్నింగ్స్లో 624 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాలో కోహ్లి 10 ఇన్నింగ్స్లో 558 పరుగులు చేశాడు. ద్రవిడ్ రికార్డును అధిగమించేందుకు కోహ్లి మరో 66 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక సౌతాఫ్రికాలో సచిన్ 1161 పరుగులతో టాప్లో …
Read More »మీరు ఓలా వాడుతున్నరా..?
ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్, పేమెంట్ …
Read More »రీఎంట్రీలో కేక పెట్టిస్తున్న హాట్ యాంకర్ ఉదయభాను
బుల్లితెర మోస్ట్ సీనియర్ హాట్ యాంకర్ ఉదయభాను.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మహారాణి ఈమె. ఇప్పుడు మనం సుమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆమె కంటే ముందు స్టార్ యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే. బుల్లితెరకు గ్లామర్ షో అద్దిన యాంకర్ ఈమె. ఒకప్పుడు కేవలం ఈమె కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు ఆడియన్స్. కేవలం యాంకర్‌గానే కాకుండా …
Read More »Power Star అభిమానులకు Good News
టాలీవుడ్ సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో గోపాల గోపాల సినిమాలో కృష్ణుడిగా నటించి అలరించిన పవన్.. మరోసారి వెండితెరపై దేవుడిగా కనువిందు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సముద్రఖని వినోధాయ సిత్తం అనే సినిమాను డైరెక్ట్ చేయగా.. తెలుగు రీమేక్లో ఈ మూవీలో దేవుడి పాత్రను పవన్తో చేయించాలని భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Read More »రాజన్న సిరిసిల్ల లో ఒమిక్రాన్ కలవరం
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 78,291 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 139.70 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ జరిగింది. …
Read More »రోగనిరోధకశక్తిని ఇలా పెంచుకోండి
రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగాలి రోజూ తేనె తాగడం అలవాటు చేసుకోవాలి విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి జీడిపప్పు, బాదం, వేరుసెనగ, ఆవాలు, వెల్లుల్లి, నువ్వులు తినాలి చిలగడదుంపలు తినడం వల్ల దానిలో ఉండే.. బీటాకెరోటిన్ అనే పదార్థం ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ ఇమ్యూనిటీని పెంచుతుంది పుట్టగొడుగులను తీసుకోవాలి
Read More »డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి
డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్ను తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోట్టీ అన్నారు. తాను ఇప్పటివరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశానని, సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. కాగా, కోట్టీ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించి ఆ దేశ వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.
Read More »