గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, …
Read More »కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
ఏపీలోని కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. భారీ వర్షానికి విమానాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లో చక్కర్లు కొడుతోంది. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన ఇండిగో విమానం సుమారు అరగంట నుంచి గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది.
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ లా నేను మాటలు రాయలేను
మాటల మాంత్రికుడు.. సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా తాను మాటలు రాయలేనని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ఎవరినీ ప్రభావితం చేయను. నా జీవితంలో వచ్చిన సమస్యల చుట్టూ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా. నాకు తెలియని అంశంపై సినిమా చేయలేను. నా సినిమాలు అందరికీ రిలేటివ్ గా ఉంటాయి. నేను మాట్లాడే భాషలో రాస్తా. త్రివిక్రమ్ లా నేను రాయలేను’ అని శేఖర్ …
Read More »రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. T20ల్లో 10000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అలాగే ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు. 285 మ్యాచ్ గేల్ ఈ ఫీట్ అందుకోని తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి ఈ రికార్డు అందుకోవడానికి 299 మ్యాచ్ లు ఆడాడు. అలాగే 303 మ్యాచ్ వార్నర్ 10వేల పరుగుల …
Read More »MI పై RCB ఘనవిజయం
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లోనూ రాణించి.. ముంబైని కట్టడి చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 165/6 రన్స్ చేసింది.. ముంబై 18.1 ఓవర్లలో 111కు ఆలౌటైంది. ముంబై జట్టులో రోహిత్ శర్మ(43), డికాక్(24) తప్ప ఎవరూ ఆడలేదు. RCB బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3, మ్యాక్స్వెల్ …
Read More »ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోము-రోహిత్ శర్మ
తమ ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు వరుస వికెట్లు తీస్తూ ఒత్తిడి పెట్టినప్పుడు మేం పుంజుకోవాల్సి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆటగాళ్లు. వాళ్లపై ఒత్తిడి పెట్టబోం. వాళ్లిద్దరూ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాం. మావాళ్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఒక దశలో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ మావాళ్లు …
Read More »టెస్ట్ క్రికెట్ కు మొయిన్ అలీ రిటైర్మెంట్
ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ప్రస్తుతం దుబాయ్ ఐపీఎల్ ఆడుతున్న అలీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, యాషెస్ సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే అంతకాలం ఇంటికి దూరంగా ఉండలేనని భావించిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 64 టెస్టులు, 112 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.
Read More »విచారణకు సజ్జనార్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్ కౌంటర్పై.. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ VS సిర్పుర్కర్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఎన్ కౌంటర్ టైంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న VC సజ్జనార్ను తొలిసారిగా కమిటీ విచారించనుంది. ఆయనకు సమన్లు జారీ చేసిన కమిషన్.. మంగళవారం లేదా బుధవారం విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దిశ ఎన్ కౌంటర్పై NHRC నివేదికపై నేడు విచారణ జరగనుంది.
Read More »టాలీవుడ్ లో విషాదం
ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మరణించారు. RR మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ పలు చిత్రాలు నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మ్యాన్, పైసా వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. వెంకట్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read More »మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో RGV
ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొండా పేరుతో సినిమాను ప్రకటించిన RGV.. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని సినిమాగా మలచనున్నాడు. తాజాగా ఓ టీజర్ను విడుదల చేసిన RGV.. ‘ఎన్ కౌంటర్లో చంపేయబడ్డ రామకృష్ణ (RK)కి, కొండా మురళికి ఉన్న మహా బంధం గురించి వివరిస్తా. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాపై ఫస్ట్ హ్యాండ్ సమాచారం పొందాను’ …
Read More »