T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనిల్ కుంబ్లేను BCCI సంప్రదించిందట. గతంలో కుంబ్లే కోచ్గా పనిచేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం IPLలో PBKS కోచ్ ఉన్నాడు. కుంబ్లే తో పాటు కోచ్గా లక్ష్మణ్ను సంప్రదించిందట. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ గురించి BCCI ఆలోచన చేస్తోందట.
Read More »దేశంలో కొత్తగా 35,662 కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా కరోనా బాధితుల సంఖ్య 3,34,17,390కు పెరిగింది. మరో 281 మంది మృతి చెందగా.. కరోనా మరణాల సంఖ్య 4,44,529కు చేరింది. మరో 33,798 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3,26,32,222 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,40,639 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఫ్యాన్ చేసిన పనికి సమంత ఎమోషనల్
టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత తన ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. పవన్ అనే ఓ అభిమాని హీరోయిన్ సమంత పేరును SAMMUగా చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. సమంతను ట్యాగ్ చేస్తూ.. ‘నా ఫస్ట్ లవ్ & లాస్ట్ లవ్’ అంటూ ఆ ఫోటోలను ట్వీట్ చేశాడు. ఎమోషనల్ ఎమోజీలతో ఈ పోస్టును సామ్ రీట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. సామ్ తనకు …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ జంటగా అనుభూతి కశ్యప్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డాక్టర్ జీ’. ఈ చిత్రంలో ఫాతిమా అనే మెడికో పాత్రలో రకుల్ నటిస్తోంది. సినిమా కోసం డాక్టర్ల మేనరిజమ్స్ ఫాలో అయ్యానని పలువిషయాలు చెప్పుకొచ్చింది.. ఈ బ్యూటీ. ‘డాక్టర్ కోటు ధరించగానే చాలా బాధ్యతగా ఫీలయ్యేదాన్ని. వారి జీవితాలు ఎంత కష్టమో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లగానే నేను రకుల్ ప్రీత్ సింగ్ ను కాదు అనిపించేది’ …
Read More »రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. సీఎం జగన్, పలువురు మంత్రులపై అసభ్య పదజాలంతో విమర్శలు చేశారంటూ గుంటూరు జిల్లా నకరికల్లు(మ) కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రులను ఉద్దేశించి పరుష పదజాలంతో అయ్యన్న వ్యాఖ్యలు చేయడం సరికాదని ఫిర్యాదులో కోటేశ్వరరావు పేర్కొన్నారు.
Read More »దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో దారుణం జరిగింది. బుల్గానిన్ మరణవార్త తెలిసి ఆయన మేనత్త …
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాయికోడ్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సమావేశంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజు పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, మండల టీఆర్ఎస్ కార్యదర్శి శంకర్, ఎంపీటీసీ నిరంజన్, నాయకులు మారుతి, శంకర్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిన సందర్భంగా …
Read More »గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా కుల సంఘాలతో కలిసి రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్ …
Read More »హైవే పైన పచ్చదనం పెంచాలి
కోదాడ నుంచి బళ్లారి వరకు వయా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ఉన్న జాతీయ రహదారి వెంట ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై ఉన్న విధంగా జడ్చర్ల -మహబూబ్ నగర్ హైవే పైన పచ్చదనం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్ పట్టణ శివారులోని అప్పన్నపల్లి వద్ద జాతీయ …
Read More »