మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలా హాబీ టేషన్లలలో క్షేత్రస్థాయిలో సమస్యల వల్ల మిషన్ భగీరథ నీరు చేర లేదన్నారు. సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.అన్ని …
Read More »హుజరాబాద్ నియోజకవర్గంలో TRSదే గెలుపు-హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
హుజరాబాద్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరీంనగర్ జిల్లా మసీదుల కమిటీ నిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ ముజహిద్ హుస్సేన్ తదితరులు హైదరబాద్ లోని బంజారాహిల్స్ ఉన్న హోం మంత్రి నివాసంలో సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మసీదుల నిర్మాణం విషయంలో వారు వినతి పత్రాన్ని హోం మంత్రి కి సమర్పించారు. ఈ సందర్భంగా …
Read More »వచ్చేనెల 1 నుంచి కార్యకర్తలకు జీవితబీమా
టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు వచ్చేనెల 1 నుంచి జీవిత బీమా అమలు కాబోతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా 61లక్షల సభ్యత్వం చేయించటం ఒక ఎత్తు అయితే సభ్యత్వ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయటం మరో ఎత్తు అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మంగళవారం పార్టీ ప్రధాన …
Read More »మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి షాక్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు. టీఆర్ఎస్ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా ఆయన షాకిచ్చిన …
Read More »టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల
టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనుంది. ఫలితాలకు ఒక్కరోజు ముందే పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సైతం సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే నెల 5 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Read More »ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు
వచ్చే ఆగస్టు కల్లా చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తమ పార్టీ ఎంపీలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాజ్యసభలోనూ పిల్లల వ్యాక్సినేషన్ గురించి ఓ సభ్యుడు ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి సమాధానం ఇవ్వబోయారు. కానీ విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఆరోగ్య …
Read More »టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు వెబ్ …
Read More »టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కౌటాల మ౦డల౦లోని గురుడుపేట గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌లోని ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో …
Read More »నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి…..
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు (225), వర్ధన్నపేట (604), పర్వతగిరి (452) మండలాల లబ్దిదారులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి …
Read More »ప్రధాని మోదీకి దీదీ షాక్
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …
Read More »