తనకు ఆర్థికంగా సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నటుడు పొన్నాంబళం కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రూ. 2 లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నా’ అని పొన్నాంబళం పేర్కొన్నాడు.
Read More »బార్లీ నీళ్లు తాగితే
బార్లీ నీళ్లు తాగితే కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… శరీరంలోని వేడి బయటకు పోతుంది కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి రక్తసరఫరా మెరుగుపడుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతారు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి చెడు కొలెస్ట్రాలు కరిగిస్తుంది..
Read More »ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్లు
కొవిడ్ మందుల పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. వాటిని కొరోనిల్, కొరొజీరో, గోకరోనాగో అని పిలవడానికి అభ్యంతరం లేదని, భారీ ఇంగ్లీష్ పదాలతో ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్కు పేరుంది. ఈ క్రమంలో …
Read More »సినిమాల్లోకి మోదీ
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
Read More »కంటతడిపెట్టిన ప్రధాని మోదీ
కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read More »4రోజులు నిద్రపోని హాట్ బ్యూటీ..ఎందుకంటే..?
గతంలో లీకైన తన న్యూడ్ వీడియో గురించి హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పందించింది. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని గతంలోనే ఆమె క్లారిటీ ఇచ్చింది. తాజాగా.. ఆ వీడియో వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయాను. 4 రోజులు బయట అడుగుపెట్టలేకపోయానని తెలిపింది. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read More »ఎంపీ RRRకి బెయిల్
ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణకు 24 గంటల ముందే సీఐడీ నోటీసులివ్వాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. విచారణకు సహకరించాలని రఘురామను ఆదేశించింది. రఘురామ సోషల్ మీడియా, మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టరాదని తెలిపింది.
Read More »జాజికాయతో లాభాలెన్నో..?
జాజికాయలో ఆరోగ్య సుగుణాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జాజికాయ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది. వేడి పాలలో తేనె, యాలకుల పొడి, జాజికాయ పొడి కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. జాజికాయలోని ఆయిల్స్ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. దీన్ని తింటే జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. జాజికాయ ఆయిల్ పంటి నొప్పిని తగ్గిస్తుంది. దీని కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది. …
Read More »థర్డ్ వేవ్ భయాంకరంగా ఉండబోతుందా..?
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే.. థర్డ్వేవ్ భయాలు వణికిస్తున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా అక్కడ చిన్నారులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. మార్చి-మే నెలలను పోలిస్తే.. చిన్నారుల్లో 145% అధికంగా.. టీనేజ్ పిల్లల్లో 160% 3 3 అధికంగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2నెలల్లో ఇప్పటికే 15,000పైగా చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు.
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »