తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఉన్న ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో నాన్ కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందించనున్నారు. ఈ దవాఖానను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మొదట 50 పడకలతో సేవలు ప్రారంభించి, వారం రోజుల్లో దానిని 250 …
Read More »దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. వైరస్ పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వరుసగా తొమ్మిదో రోజూ దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా మరోమారు మూడు వేలకుపైగా బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3498 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య …
Read More »కరోనా కష్ట కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ
కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ …
Read More »సాగర్ ఎగ్జిట్‌పోల్స్- టీఆర్ఎస్‌దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పార్టీల వారీగా పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది. టీఆర్‌ఎస్ – 50.48%, కాంగ్రెస్ …
Read More »తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కు పెరిగాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కోలుకున్నారు. …
Read More »తెలంగాణలో ప్రతి రోజూ పది లక్షల టీకాలు
తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నది. అందరికీ ఉచితంగా టీకా వేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, క్వారంటైన్ నుంచి బయటకు రాగానే తానే స్వయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షిస్తానని …
Read More »సీఎం కేసీఆర్ కి యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ గారికి గురువారం నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. నిన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు శ్రీ ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం …
Read More »తెలంగాణలో లాక్‌డౌన్‌పై మంత్రి ఈటల స్పష్టత
తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ర్టంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి ఈటల ఫైర్
కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే …
Read More »కోలుకున్న ధోనీ తల్లిదండ్రులు…!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌సింగ్ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగటివ్ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ …
Read More »