Home / Tag Archives: slider (page 740)

Tag Archives: slider

ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు

ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.

Read More »

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతపై కీలక ప్రకటన

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు పాస్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ ఫీజు చెల్లించిన వారే పాస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని సూచించారు. అది తప్పుడు వార్త అని.. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More »

కరోనా ఎఫెక్ట్ – మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేయాలని.. తద్వారా ఆక్సిజన్ నిల్వల్ని వైద్య అవసరాల కోసం మళ్లించనున్నట్లు తెలిపింది. మే 1 నుంచి 9 వరకు హర్యానాలోని ఫ్యాక్టరీలను మూసి ఉంచనుండగా.. ప్రజల ప్రాణాల్ని రక్షించడంలో ప్రభుత్వానికి తమ సహకారం నిరంతరం కొనసాగుతుందని మారుతీ హామీ ఇచ్చింది.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై క్లారిటీ

తెలంగాణలో లాక్డౌన్ వార్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పందించారు. వైద్యారోగ్య శాఖ లాక్డౌన్పై ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే 3, 4 వారాల్లో కరోనావైరస్ అదుపులోకి వస్తుందన్నారు. లాక్డౌన్ పెట్టాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు లాక్ డౌన్ సీఎం KCRకు ఇష్టం లేదని హోంమంత్రి అన్నారు.

Read More »

కరోనా సోకిన వారు ఇవి తినాలి..?

మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా  లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …

Read More »

అనుష్కకు పెళ్ళా..ఎవరితో…?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న స్వీటీ కుటుంబసభ్యులకు.. ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం. అతడు దుబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకని, అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడని తెలిసింది. కరోనా తగ్గితే ఇరుకుటుంబాలు చర్చించుకొని పెళ్లికి ముహుర్తం పెట్టుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.

Read More »

సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు

ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat