యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Read More »మహారాష్ట్రలో కరోనా విజృంభణ
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.
Read More »తెలంగాణలో నేడు వ్యాక్సినేషన్ బంద్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్ నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. సోమవారం నుంచి యథాతథంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. ప్రజలెవరూ వ్యాక్సినేషన్ కేంద్రాలకు రేపు రావొద్దని ప్రభుత్వం సూచించింది.
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు …
Read More »ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 పరుగులు చేసిన సంగతి తెలుసు కదా. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మొత్తం సిక్సర్ల సంఖ్య 217కు చేరింది. ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో …
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. వరుసగా దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 1,501 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,38,423 మంది …
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 5093 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. వైరస్ బారినపడినవారిలో 15 మంది మరణించగా, మరో 1555 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 లక్షలకు చేరాయి. ఇందులో 3.12 లక్షల మంది డిశ్చార్జీ అవగా, 1824 …
Read More »వరంగల్ లో బీజేపీకి భారీ షాక్..
వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేల బీజేపీకి గట్టి షాక్ తగిలింది..వరంగల్ లో గత 25 ఏండ్లుగా బీజేపీకి వివిద హోదాల్లో సేవ చేసి బీజేపీ ని నిలబెట్టిన సీనియర్ బీజేపీ నాయకుడు గందె నవీన్ గారు,వారి సతీమణి గందె కల్పన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీలో చేరారు.. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కండువా కప్పి పార్టీలోకి …
Read More »మున్సిపల్ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి: మంత్రి కేటీఆర్
తెలంగాణరాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అధికారులను ఆదేశించారు.మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి ఇవ్వాళ ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా …
Read More »