అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మె ల్యే హన్మంత్‌షిండే అన్నారు. బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం మత్స్యకారులను ఆదుకునేందుకు నెల రోజు ల కిందటే చేప పిల్లలను ఉచితం గా విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 24.09 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. …
Read More »అమెరికా ఉపాధ్యాక్షుడికి కరోనా టీకా
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారని వైట్‌హౌస్ ప్రకటించింది. కొవిడ్ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్ పెన్స్ టీకా భద్రత, సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకుంటారు’ అని వైట్‌హౌస్ తెలిపింది. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అమెరికాలో ఇటీవల కొవిడ్ …
Read More »1000కోట్లతో ఫియట్ భారీ పెట్టుబడి
హైదరాబాద్ ఐటీ సిగలో మరో చంద్రవంక చేరనున్నది. ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ ఫియట్ తన రెండో మజిలీగా హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. ప్రపంచశ్రేణి వాహనాల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫియట్ తెలంగాణలో తమ పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం తమకు సాధ్యపడిందని ఫియట్ సగర్వంగా ప్రకటించింది. 150 మిలియన్ అమెరికన్ డాలర్లతో (రూ.1,110కోట్లు) ఫియట్ గ్లోబల్ హబ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్టు …
Read More »ఫియట్ రాక చాలా సంతోషకరం
ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …
Read More »రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త
రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్‌నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి వివరాలు అందించాలని సూచించింది. ఈ నెల పది వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్‌ఏ నుంచి వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 27 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం …
Read More »మంత్రి పువ్వాడకు కరోనా
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం మంత్రి పువ్వాడకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. తనను కలిసినవారు, తనతో వివిధ కార్యక్రమాల్లో సన్నిహితంగా మెలిగిన ప్రతిఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు.
Read More »మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం
హైదరాబాద్ మహానగరంలో ప్రయాణమంటేనే నరకం. రోడ్డెక్కితే చాలు..ఇంటికి ఎప్పుడు చేరుతామన్న గ్యారంటీ లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్‌లు. సిగ్నళ్లు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేం. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడుతూ ప్రయాణిస్తూ చాలామంది అలసటకు లోనవుతున్నారు. ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరరోడ్లపై నిత్యం నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాదీలు మెట్రో రాకతో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. చింతలను దూరం చేసి..వింతలను పరిచయం చేస్తున్న మెట్రోలో మియాపూర్-ఎల్బీనగర్ వరకు ప్రయాణిస్తూ కొందరిని పలకరించగా కొత్త …
Read More »మూసీ మురిపించేలా
మురికి మూసీని సుందర మూసీగా మార్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. కాలుష్య కోరల నుంచి మూసీని రక్షించి ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం సుందరీకరణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీకి సమాంతరంగా నాగోలు వంతెన మొదలుకొని కొత్తపేట సత్యానగర్ వరకు రోడ్డు ఫార్మేషన్ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. మూసీని సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీ) చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి …
Read More »యువతకు చేయూత
ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న …
Read More »కరోనా వ్యాక్సిన్స్ పై తాజా సమాచారం
కోవిడ్-19ను ఎదుర్కొనే దిశగా భారత్‌లో ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు నీతి ఆయోగ్(హెల్త్) సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మంగళవారం ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ వారంలో మరో వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్‌కు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జెనోవా కంపెనీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. …
Read More »