తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై వ్యాఖ్యాతగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో …
Read More »దేశంలో మళ్లీ కరోనా కలవరం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 …
Read More »GHMC Results Update-నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని …
Read More »రైతన్నకు అండగా దేశం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను …
Read More »వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన చివరి టీ20లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకిచ్చింది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత బంతితో విధ్వంసక బ్యాట్స్‌మన్ అరోన్ ఫించ్(0)ను పెవిలియన్ పంపాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో సుందర్‌ను బౌలింగ్‌కు దింపాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కు ఆవల విసరడంతో …
Read More »ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూరమైన ఆరోన్ ఫించ్.. ఈ మ్యాచ్‌కు మళ్లీ ఆసీస్ కెప్టెన్‌గా వచ్చాడు. ఆల్‌రౌండర్ స్టాయినిస్‌ను ఆస్ట్రేలియా పక్కన పెట్టింది. ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Read More »రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్
వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More »కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకం
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, ఆ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి. వీటి ద్వారా రైతన్నలకు లాభం జరగకపోగా భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. నూతన చట్టంలో ‘మద్దతు ధర’ అన్న …
Read More »భారత్ బంద్‌లో ఎమ్మెల్సీ కవిత
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ కవిత.. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్స్‌ను …
Read More »తన రెండో పెళ్ళికి అసలు కారణం చెప్పిన సునీత
ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. తన లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌లో ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు …
Read More »