తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 9 మంది మృతి చెందారు. తాజాగా 2,259 మంది కోలుకున్నారు. 29,447 యాక్టివ్ కేసులకు గాను 23,934 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 283 నమోదవగా, కరీంనగర్‌లో 109, ఖమ్మంలో 92, మేడ్చల్‌లో 160, నల్లగొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్ అర్బన్‌లో 85, సిద్దిపేటలో 78, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రో.నాగేశ్వరరావు
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Read More »ఆ రోజుతో నా జీవితం మారింది
దాదాపు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది చెన్నై చిన్నది త్రిష. రెండు భాషలకు చెందిన అగ్ర హీరోలందరితోనూ పనిచేసింది. సినిమాల్లోకి రాకముందు త్రిష `మిస్ చెన్నై`గా నిలిచింది. 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ఆ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. `30-09-1999.. ఆ …
Read More »గాడి తప్పిన దేశ ఆర్థికం
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరమైన రీతిలో పతనమవుతున్నది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దానిని చక్కదిద్దటంపై దృష్టిపెట్టడానికి బదులు, తమ చేతిలో అధికారాల కేంద్రీకరణకు, రాష్ర్టాల ఫెడరల్ హక్కులు హరించేందుకు, దేశ సంపదలను పూర్తిగా ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నది. దీనంతటి మధ్య నిపుణులు 1991 తరహా ఆర్థిక సంస్కరణలను తిరిగి చేపట్టవలసిన అవసరం ఏర్పడిందంటున్నారు. ఈ నెల 25న విడుదలైన నేషనల్ కౌన్సిల్ ఫర్ …
Read More »వైద్యాధికారులతో మంత్రి ఈటల సమావేశం
తెలంగాణలో కరోనా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన మంత్రి. ఆసుపత్రిలో ఉన్న వివరాలు పేషంట్లు, బెడ్స్ వివరాలు, ఆక్సిజన్ ఫెసిలిటీ రోగులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసిన విధంగానే కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించిన అధికారులు.. అయినా పరీక్షల సంఖ్యను ఏమాత్రం కూడా తగ్గించవద్దని పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్ లను కూడా పరీక్షలు నిర్వహించడం ద్వారా పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయాలని …
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం… జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్ నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం… అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది …
Read More »అధునాతన టెక్నాలజీతో జీహెచ్ఎంసీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సమావేశం నిర్వహించారు. పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు టీ పోల్ పై అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల లిస్టు, పోలింగ్ కేంద్రాల …
Read More »పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్‌లో వివిధ స్టాండింగ్ కమిటీలను పునర్నియమించారు. ఈ పునర్నియామకాల్లో పలువురు టీఆర్ఎస్ ఎంపీలకు చోటు లభించింది. పరిశ్రమల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నియమితులయ్యారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ను రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ కమిటీలో సభ్యుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానం కల్పించారు. కెప్టెన్ లక్మీకాంతరావును డిఫెన్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. సిబ్బంది, …
Read More »తెలంగాణలో కొత్తగా 1,378కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్-19 వైరస్ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 1107 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం …
Read More »బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా- మంత్రి హారీష్ రావు
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారా?, ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న ఏ ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మాత్‌పల్లి, మంగోల్ గ్రా మాల్లో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనులకు …
Read More »