Home / Tag Archives: slider (page 927)

Tag Archives: slider

రైల్వేలైన్ పనులు వేగవంతం చేయాలి

మనోహరాబాద్ రైల్వేలైన్ పనులను వేగవంతం చేయాలని.. గజ్వేల్ ‌రైల్వే‌‌‌ స్టేషన్ పనులు పూర్తి అయినందున ప్రయోగాత్మకంగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు‌ అధికారులను ఆదేశించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. పనులు వేగంగా జరగాలంటే వివిధ …

Read More »

రేవంత్ రెడ్డి సవాల్

కీసర తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్‌హెడ్స్‌ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు. తన లెటర్‌హెడ్స్‌ లభించడంపై …

Read More »

2020-21 షెడ్యూల్‌ ప్రకటించిన జేఎన్‌టీయూ

ప్రస్తుత 2020-21 విద్యా సంవత్సరాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. ఇంజినీరింగ్‌, బీఫార్మసీ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేపట్టనుంది. ఈ మేరకు విద్యా సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.మంజూర్‌ హుస్సేన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూజీ, పీజీ విద్యార్థులందరికీ అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి సెమిస్టర్‌ పూర్తిగా …

Read More »

తెలంగాణలో 2,384 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శనివారం (22వ తేదీన) 2,384 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,04,249కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 755కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,851 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …

Read More »

నాగార్జునసాగర్‌ 18 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 4,07,570 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 18 గేట్లను పైకెత్తి 1,67,153 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586.04 అడుగుల నీరు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 300.32 టీఎంసీల నీరు నిల్వ …

Read More »

కరోనాపై గుడ్ న్యూస్

టెస్టుల సంఖ్య భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్‌, మెరుగైన వైద్య సదుపాయాలు తదితర చర్యలతో భారత్‌లో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 65 వేలకుపైగా కేసులు నమోదవుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆస్పత్రులపై భారాన్ని తగ్గిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 63,631 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 22,22,577కి …

Read More »

బిగ్ బాస్-4 లో గంగవ్వ

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన చాలా మందికి ఇప్పుడు బిగ్‌బాస్ మంచి టైమ్ పాస్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ కూడా బిగ్‌బాస్ 4లో పాల్గొన‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మై విలేజ్ …

Read More »

సోనాక్షి సిన్హాపై అసభ్య వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో ప్రముఖ సినీహీరోయిన్ సోనాక్షిసిన్హాపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఔరంగాబాద్ యువకుడిని ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు ‘దబాంగ్’ సినిమా నటి సోనాక్షిసిన్హాను దూషిస్తూ ఆమెపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు …

Read More »

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 31న ఈ సెట్, సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్ ఎగ్జామ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్‌ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఐసెట్, అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్ పరీక్ష …

Read More »

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఈరోజు ఒక్క రోజే కరోనా కేసులు రెండు వేల మార్క్‌ను దాటాయి. తాజాగా 2,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865గా నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరింది. కొత్తగా 1768 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat