తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు
Read More »రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు `.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు …
Read More »కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన రష్యా
కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల్లో రష్యా గొప్ప పురోగతి సాధించింది. ఈ నెల 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలెగ్ గృందేవ్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ రోజు జరగనుందని తెలిపారు. దీంతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. గామలేయా సెంటర్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో దశలో ఉందని తెలిపారు. ముందుగా వైద్య వృత్తిలో …
Read More »కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …
Read More »ప్లాస్మా సంజీవని లాంటిది: చిరంజీవి
హైదరాబాద్ కమిషనరేట్ లో ప్లాస్మా డోనర్ల సన్మాన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 150 మంది ప్లాస్మా డోనర్లను చిరంజీవి, సీపీ సజ్జనార్ తో కలిసి సన్మానించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మా అనేది సంజీవనిలా పనిచేస్తుందని చిరంజీవి అన్నారు. ప్లాస్మా దాతలకు చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరారు, ప్లాస్మా …
Read More »మరో నటి ఆత్మహత్య
ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More »తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకున్నారు .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 …
Read More »20లక్షలు దాటిన కరోనా కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల …
Read More »పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీ వియోగం
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి (74)కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో …
Read More »