తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసముంటున్న అంజమ్మ ఇంటి పైకప్పు నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలింది. అదే సమయంలో నిద్రిస్తున్న చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అంజమ్మకు …
Read More »మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Read More »కోదాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
కోదాడ మున్సిపాలిటీని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.సోమవారం కోదాడ పట్టణంలోని 21వ వార్డులో రూ.80లక్షలతో, 28వ వార్డులో రూ.54లక్షల వ్యయంతో రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, 7వ వార్డుల బాలాజీ నగర్ లోని కోటి 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామమును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. …
Read More »ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా …
Read More »భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి
కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …
Read More »టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి …
Read More »నవభారతానికి బోణీ-మునుగోడు విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఆరంభం
ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న వేళ.. చట్టాలు చట్టుబండలవుతున్న తరుణాన.. రాజ్యాంగబద్ధ సంస్థలు నిర్వీర్యమవుతున్న సమయాన.. ఆరాచక శక్తుల వికృత చేష్ఠలకు భారతీయ సమాజం విచ్ఛిన్నమవుతున్న పరిస్థితుల్లో ఆ కుట్రలకు చెల్లుచీటీ పలికేందుకు.. రక్కసి మూకలను తరిమికొట్టేందుకు పిడికిలి బిగించి జాతీయ రాజకీయాల బరిలో దూకిన భారత్ (తెలంగాణ) రాష్ట్ర సమితి.. మునుగోడులో విజయకేతనం ఎగరేసి బోణీ కొట్టింది. నవభారతానికి నాంది పలుకుతూ గులాబీ దండు జైత్రయాత్రను ప్రారంభించింది. కారు దూసుకెళ్లింది. మోదీ …
Read More »ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవబలం తోడయింది- వినోద్ కుమార్
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కు కనీసం డిపాజిట్ వస్తే తాను …
Read More »మునుగోడు విజయం… కృష్ణార్జున సారథ్యం
తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …
Read More »