తెలంగాణలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామ్స్ సమయాన్ని అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్షల సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు పొడిగించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామని.. క్వశ్చన్ పేపర్‌లో ఛాయిస్ ఎక్కువగా ఇస్తున్నామని …
Read More »గవర్నర్ తనకు తానే అన్నీ ఊహించుకోకూడదు: కేటీఆర్
గవర్నర్ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై …
Read More »‘కేంద్రం కొత్త పథకం తెచ్చింది’.. కేటీఆర్ సెటైర్లు!
పెట్రోల్, డీజిల్ ధరల ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలతో కేంద్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చమురు ధరలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలపై రూ.26.5లక్షలకోట్ల పెట్రో పన్నుల భారం పడిందని …
Read More »టీఎస్ ఐపాస్‌తో రూ.2.2లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం తెలంగాణ ప్రభుత్వ అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నామని.. 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు …
Read More »డీకే శివకుమార్ ఛాలెంజ్.. కేటీఆర్ కౌంటర్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్ నరేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేర్కొన్నారు. …
Read More »‘లిక్కర్ మత్తులో జోగుతోంది కాంగ్రెస్, బీజేపీ నేతల పిల్లలే’
బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ దొరికిన ఘటనలో చేపట్టిన చర్యలు ప్రభుత్వం, పోలీసుల పనితీరుకి నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. డ్రగ్స్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పబ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. ఈ వ్యవహారంలో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట …
Read More »కేంద్రంపై టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్.. ప్రకటించిన కేటీఆర్
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రప్రభుత్వంపై మరింత గట్టిగా ఫైట్ చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశంలో బీజేపీ నేతలు ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా బియ్యాన్ని కొనుగోలు చేస్తోందని కేటీఆర్ చెప్పారు. ఈ యాసంగిలో …
Read More »కులవృత్తులను అవహేళన చేస్తే ఊరుకోం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష: బాల్క సుమన్
ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. ధాన్యం సేకరణపై పెద్దన్న పాతర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. దుర్మార్గం …
Read More »తెలంగాణ ప్రజల్ని పీయూష్ గోయల్ అవమానించారు: హరీష్‌రావు
తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వాలని …
Read More »