బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ దొరికిన ఘటనలో చేపట్టిన చర్యలు ప్రభుత్వం, పోలీసుల పనితీరుకి నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. డ్రగ్స్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పబ్‌పై పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు.
ఈ వ్యవహారంలో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, పబ్బులకు రెండు జాతీయ పార్టీల నేతలే ఆద్యులంటూ కాంగ్రెస్, బీజేపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. లిక్కర్ మత్తులో జోగుతోంది కాంగ్రెస్, బీజేపీ నేతల పిల్లలేనని ఆరోపించారు. బంజారాహిల్స్ పబ్ ఘటనలో బీజేపీ యువ నేత అభిషేdక్ పట్టుబడ్డారని బాల్క సుమన్ చెప్పారు.