అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు మాత్రమే వేదిక అని.. కుస్తీ పోటీలకు కాదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభ్యులకు సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించేలా అసెంబ్లీని వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో సూచించారు. శుక్రవారం శాసనసభ వాయిదాపడిన …
Read More »అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణలోని ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మధ్య సరదా సంభాషణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ముగిసిన అనంతరం అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మధ్య సరదా సంభాషణ జరిగింది. రసమయి గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి అన్న వ్యాఖ్యలకు సమాధానంగా.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుందని రసమయి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లను గుర్తించి పాడొచ్చని జర్నలిస్టుల సలహాతో కొత్త పీసీసీపై పాట పాడే స్టేచర్ లేదన్నారు. తన పాట తెలంగాణ …
Read More »ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెట్ సిల్వర్ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »కుల వృత్తులకు పూర్వ వైభవం
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేసి.. జిల్లాలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో నీళ్లు, కరెంటు కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. మూడేండ్లలోనే దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తిచేసుకొని …
Read More »అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …
Read More »మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్
జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కంటోన్మెంట్ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్ చేశారు. ‘సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.
Read More »కేంద్ర మంత్రితో మంత్రి తలసాని భేటీ…ఎందుకంటే..?
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి పరుషోత్తం రూపాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాలకు, పథకాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మద్దతు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర …
Read More »GHMCలో కొత్తగా 49 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో మరో 49 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 1,40,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »అర్హులైన ప్రతి కుటుంబానికి దళితబంధు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలకు అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కొత్తగా వివాహం అయినవారికి కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. అకౌంట్లలో పడిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులతోపాటు 65 ఏళ్లలోపు ఉన్న …
Read More »