వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ …
Read More »కామారెడ్డి పోలీసు కార్యాలయం ప్రారంభం
సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More »తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం : సీఎం శ్రీ కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట …
Read More »తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు: ఎన్వీ రమణ
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్.వి.రమణ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన శతకోటి వందనాలు తెలిపారు. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదన్నారు. వారం రోజుల పర్యటనలో ఆశీర్వచనాలతో నిష్కల్మషం ముంచెత్తిందన్నారు. ప్రగతిశీల తెలంగాణ సమాజానికి వందనాలు తెలిపారు. తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన …
Read More »జయశంకర్ సార్ ను స్మరించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తున్నాం. సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని చెప్పారు. కొత్త రాష్ట్రామైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే జయశంకర్ సార్ ఇచ్చే …
Read More »TSRTC శుభవార్త
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …
Read More »తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ను ఎత్తివేసి …
Read More »రేపు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి.. తదితర అంశాల పై కేబినెట్ చర్చించనున్నది.
Read More »మంత్రి కేటీఆర్ ని కలిసిన వేములవాడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …
Read More »మాజీ మంత్రి ఈటెల డొల్లతనాన్ని బట్టబయలు చేసిన మంత్రి గంగుల
మాజీ మంత్రి కభ్జా ఆరోపణల నేపథ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజెందర్ పై రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా యువత చేరిన కార్యక్రమంలో గంగుల కమలాకర్ పాల్గొని వారికి ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తిని ఇష్టానుసారంగా అనుచిత వాఖ్యలు …
Read More »