ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Read More »ఇందండీ చంద్రబాబు తీరు.. వాళ్లు చేయరు.. జగన్ ను చేయనీయరు..!
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను జెట్ స్పీడుతో ముందుకెళుతున్నాయి. లాక్డౌన్.. కరోనా టైంలోనూ పోలవరం పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగుతున్నాయి. దీనిని చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్ కో(పచ్చమీడియా) పోలవరానికి అవినీతి మరలు అంటించేందుకు కంకణం కట్టుకున్నారు. దీనిలో భాగంగా పోలవరం నిర్మాణంపై పదేపదే తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ ఒక అబద్దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. పోలవరం జలాశయంలో ప్రస్తుతం …
Read More »ఎమ్మెల్యే రోజాకి సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్జ్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఫోన్ చేసినందుకు సంతోషంగా …
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం
ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది.
Read More »తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఆయన మృతి తీరనిలోటని అభిప్రాయపడ్డారు . ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ అధికార పార్టీ వైసీపీలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గున్ తోటి వెంకటసుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి …
Read More »ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త
ఏపీలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ సర్కారు శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ 2 పథకాలకు ముందుగా నిర్ణయించిన గడువు ఈ నెల 25తో ముగియగా.. పలువురు విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనందున గడువును పెంచింది. వసతి దీవెన …
Read More »