ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు.
కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,104.