Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

వైసీపీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

ఏపీలోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు ఆయన మృతి తీరనిలోటని అభిప్రాయపడ్డారు .

ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే  మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య   పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ గా స్థానికంగా పేరు ప్రఖ్యాతలు గడించారన్నారు