Home / MOVIES / దా..వుడా! అది చేయ‌కుండానే స్టార్‌ల‌య్యారా?

దా..వుడా! అది చేయ‌కుండానే స్టార్‌ల‌య్యారా?

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ర్టీలో హీరోయిన్‌గా నెగ్గుకు రావ‌డం అంటే గ‌గ‌న‌మే అని చెప్పాలి. అందులోను స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు స్టోరీ డిమాండ్ చేయ‌క‌పోయినా.. అందాల ఆర‌బోతుకు సైతం సై.. సై అనాల్సిందే. అలా అన‌కుంటే.. డైరెక్ట‌ర్ నుంచి నెక్స్ట్ అనే డైలాగ్ వినాల్సి వ‌స్తుందేమోన‌న్న భ‌యం హీరోయిన్ల‌ది. ఇక వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నే త‌పన‌తో స్పాట్‌తో తామేమి చేస్తున్నామ‌న్న‌ది కూడా మ‌రిచిపోయి అందాలను ప్ర‌ద‌ర్శిస్తుంటారు న‌టీమ‌ణులు.

ఇటువంటి ప‌రిస్థితులు ఉన్న సినీ ఇండ‌స్ర్టీలో ఎక్స్‌ఫోజింగ్ చేయ‌కుండానే స్టార్ హోదాను ద‌క్కించుకోవ‌డమంటే చాలా గొప్ప విష‌య‌మే మ‌రి. త‌మ‌కు వ‌చ్చిన అన్ని పాత్ర‌ల‌ను ఓకే చేయ‌కుండా.. అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వెళ్తున్నారు ఆ ఇద్ద‌రు హీరోయిన్లు. ఇంత‌కీ వారెవ‌రని అనుకుంటున్నారా..? వారేనండి మ‌ళ‌యాళ ముద్దు గుమ్మ‌లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కీర్తి సురేశ్‌.

ప్రేమ‌మ్ సినిమాతో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్, నేను శైల‌జ చిత్రంతో కీర్తి సురేష్ తెలుగు ఇండ‌స్ర్టీలో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ మ‌ళ‌యాళ అమ్మాయిలా.? లేక తెలుగు వారా? అనేంత‌గా క‌లిసిపోయి భారీ సంఖ్య‌లో అభిమానుల‌ను సైతం సొంతం చేసుకున్నారు. ఎక్స్‌ఫోజింగ్ చేస్తే త‌ప్ప స్టార్ స్టేట‌స్ రాని ఈ రోజుల్లో.. వీరిద్ద‌రూ స్టార్ స్టేట‌స్‌కు అంగుళం దూరంలో ఉండ‌టం విశేష‌మే మ‌రి.

అయితే, కేర‌ళ కుట్టి నిత్యా మీన‌న్ లాంటి హీరోయిన్లు మంచి.. మంచి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ప్ప‌టికీ స్టార్ హోదాను పొంద‌లేక పోయిన విష‌యం తెలిసిందే. కానీ, ప్ర‌స్తుతం ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కీర్తి సురేశ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ.. అందులోను వారు న‌టించిన చిత్రాలు వ‌రుస విజ‌యాలు సాధిస్తుండ‌టంతో ఎక్స్‌ఫోజింగ్ లేక‌పోయినా స్టార్ హోదానా? అంటూ చ‌ర్చించుకుంటున్నారు టాలీవుడ్ జ‌నాలు.

మరి వీరు సిద్ధాంతాల‌ను ఇలానే కొన‌సాగిస్తారో లేక అంద‌రి హీరోయిన్ల‌లాగా క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ క్రేజ్ కోసం అందాల ఆర‌బోత‌కు త‌మ ప‌ద్ధ‌తులు మార్చుకుంటారో!? అనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనా త‌మ హీరోయిన్లు అందాల ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌స్థావ‌నే లేకుండా స్టార్ హీరోయిన్ హోదాను ద‌క్కించుకునేందుకు అంగుళం దూరంలో ఉండ‌టంతో వారి అభిమానులు తెగ సంబ‌ర ప‌డిపోతున్నారు.