Breaking News
Home / MOVIES / నా స‌ర్వ‌స్వం.. అత‌నే..!!

నా స‌ర్వ‌స్వం.. అత‌నే..!!

సినీ ఇండ‌స్ర్టీలో ఎవ‌రి కెరియ‌ర్ ఎలా ప్రారంభం అవుతుందో.. ఎలా మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ, ఆరంభం ఎంత బాగుంటే.. ముగింపు అంతకు మించి బాగుంటుంది అంటారు పెద్ద‌లు.

ఇక అస‌లు విష‌యానికొస్తే.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెర‌కెక్కిన సూప‌ర్ చిత్రంతో వెండితెర‌పై ఆరంగ్రేటం చేసింది అనుష్క స్వీటీ. ఆమె సినీ కెరియ‌ర్ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనుష్క ఎన్నో చిత్రాల్లో న‌టించింది. ఎన్ని చిత్రాల్లో న‌టించినా రాని గుర్తింపు కేవ‌లం అరుంధ‌తి సినిమాతో అనుష్క ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. అలా అరుంధ‌తి సినిమాకు న‌న్ను ఎంచుకోబ‌ట్టే నా కెరియ‌ర్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉందంటూ చెప్పుకొచ్చింది అనుష్క స్వీటీ.