ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.నిన్న మొన్నటివరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఇతర నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా అక్కడ సీన్ రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.నిన్న కాక మొన్న సోమవారం వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే మణి గాంధీ మీడియాతో మాట్లాడుతూ బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే జయరాముడు కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు.
ఈ నిర్ణయం ఆరు నెలలకు ముందే తీసుకున్నారు.త్వరలోనే ఆయన పార్టీ మారనున్నారు .మరో మూడు నెలల్లో రాజకీయ సమీకరణలు మారతాయి అనిఆయన అన్నారు.తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రత్యేక హోదా తీసుకురావాలంటే జగన్ తోనే సాధ్యం.ప్రస్తుతం ముఖ్యమంత్రి ఔట్ డేటెడ్ సీఎం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జేసీ చేసిన వ్యాఖ్యల బట్టి ఆయన తనయుడు జేసీ పవన్ రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నట్లు.అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట నుండి బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అందుకే జేసీ ఇలా వ్యాఖ్యానించారు అని అంటున్నారు.ఇటివల జేసీ చంద్రబాబుతో భేటీ సందర్భంగా పవన్ ఎంట్రీ గురించి అడిగితె నో చెప్పడంతోనే దివాకర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు అని రాజకీయ వర్గాల టాక్ .చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కాలమే సమాధానం చెప్పాలి ..