చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా ఉంటూ ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించే కాంగ్రెస్ పార్టీలోని నాయకులను ముందుగా ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిబస్సుయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 26 తేదీన చేవెళ్ల నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతల్లో డివైడ్ టాక్ వస్తోంది. ఇంకా చెప్పాలంటే…అసలు పాదయాత్రతో తాము సాధించేదేమీ లేదని కొందరు అంటున్నారు.
see also : వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!
గాంధీభవన్ వర్గాల్లో సాగుతున్న చర్చ ప్రకారం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ యాత్రను లైట్ తీసుకోవడం ఖాయమంటున్నారు. 24 గంటల కరెంటుతో విద్యుత్ సమస్య అస్సలేమాత్రం లేకపోవడం, సరిపడా ఎరువులు అందించడం, మద్దతు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరో వైపు అతి త్వరలో పంటల పెట్టుబడి వంటివాటితో రైతుల కళ్లల్లో మునుపెన్నడూ లేని ఆనందం వెల్లవిరుస్తోందని పలువురు కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఏం చేశామని ప్రజల్లోకి వెళ్లగలమని మథనపడుతున్నారు.
see also : 19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ..మంత్రి కేటీఆర్
పెద్ద ఎత్తున అందుతున్న పించన్లు, అద్భుతమైన విద్య, వైద్య సదుపాయాలు, జలకళతో ఉట్టిపడుతున్న ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్న ఇంటింటికి సురక్షిత తాగునీరు పథకాల వంటివి ప్రజల జీవితాన్ని మార్చేస్తున్న తరుణంలో తమ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని, ఈ యాత్రతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్న ఆదరణ ప్రత్యక్షంగా మరోమారు తెలిసిరావడం తప్పదని అంటున్నారు.