Home / EDITORIAL / సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న శనివారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఒకవేళ అవసరమైతే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను ఆయన బహిరంగంగానే ప్రకటించారు.దీంతో ఇంట బయట చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా ..అయితే ఎలా అవుతారు అని చక్కని విశ్లేషణతో విద్యావంతుడు ,సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్ “జగన్ రావు “సవివరంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.మనం ఒక లుక్ వేద్దామా ..!.ఉన్నది ఉన్నట్లు మీకోసం

see also :నా మద్దతు సీఎం కేసీఆర్ కే..అసదుద్దీన్ ఒవైసీ

“ప్రస్తుత పరిస్థితి ల్లో ప్రధాని కాగల కెపాసిటీ, కంటెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఏ చెట్టూ లేని చోట ఆముదపుచెట్టే మహావ్రుక్షం అన్నట్లు మోదీ గారు మనకి ప్రధాని అయ్యాడు. వాస్తవానికి ఆయన స్పీచ్ లు చాలా చప్పగా ఉంటై, పనులు అదే రకం. ఒక్కసారి దేశానికి హైదరాబాద్ స్పైసీ బిర్యాని లాంటి కేసీఆర్ ని పరిచయం చేస్తే 8 నెలల్లో భారతదేశానికి ప్రధాని కాగలరు.రాహూల్ గాంధీ గారు వస్తే సిరియా లో ఏమి జరుగుతుందో అదే జరుగుతది, 1970 ఆ ప్రాంతం నుంచి ఇప్పటివరకు అక్కడ తండ్రి కొడుకులదే అధికారం, అందుకే తిరుగుబాటు వచ్చింది. ఇంకా మోదీ గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లు చెప్పింది కూడా వినకుండా డీమోనిటైజేషన్ చేసి అబాసుపాలు అయ్యారు. సామాన్యుడి నెత్తిన గుడ్డ కప్పి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఆర్ధిక ఆక్రమాలకి పాల్పడినా ఏమీ ఎరగనట్లు ఉన్నాడు. ఆంధ్ర కి మట్టి ఇచ్చారు, తెలంగాణ నోట్లో మట్టి గుక్కారు. ఆయన చేసింది ఏమన్నా ఉంది అంటే కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు జైలు పాలయ్యిన యడ్యూరప్ప లాంటివారికి యన అధికారం లో రాగానే క్లీన్ చిట్ రావటం.సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థాన జడ్జీ లే మీడీయా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టారు మోదీ గారి నాయకత్వం లో. ఈ మధ్య కాలం లో మత ఘర్షణలు కూడా ఎక్కువైనవి. కారణం ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు.ఇంకా కేసీఆర్ కి ఉందే 11 సీట్లు, ప్రధాని ఎట్లైతడు అంటారు. ప్రశ్నే దిక్కుమాలిన ప్రశ్న. దాన్ని పక్కన పెడితేఆంధ్ర ప్రదేశ్: ఆంధ్ర లో బాబు కానీ, జగన్ గానీ సింగిల్ గా గెలిసే పరిస్థితి లేదు. పవన్ ఎలాగూ బాబు వైపే. జగన్ కి కేసీఆర్ ఒక్క ఫోన్ చేసి సిట్టింగ్ వేస్తే ఆంధ్ర లో జగన్ గెలుస్తడు.ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఎంపీ సీట్లు అన్నీ కేసీఆర్ వైపే.

see also :That Is Jagan-ఒక్క స్కెచ్ తో టీడీపీలో అలజడి..!

తమిళనాడు: తమిళనాడు లో ఈ మధ్య వచ్చిన కమల్ హాసన్ తెలిసినోడు కాదు, తెలియనోడు కాదు, పచ్చి మూర్ఖుడు. ఇంకా, రజనీకాంత్ గారి గురించి చెప్పాలంటే ఏమీ లేదు. ఆంధ్ర హీరోల మీద ద్వేషం తో రజనీ కాంత్ ని ఆకాశానికి ఎత్తేశారు కానీ వాస్తవానికి ఆయన కి స్టామినా లేదు. 2004 ఆ ప్రాంతం లో యైగో కి వ్యతిరేకం గా ప్రత్యక్షం గా, పరోక్షం గా రంగంలో దిగినా నాలుగు అంటే నాలుగు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా చిన్న గడ్డి పూస ని కూడ కదిలించలేకపోయాడు. అన్నాడీఎంకే లో ఉన్న లొసుగులు, అధికార పక్షం పై వ్యతిరేక వోట్లు అన్నీటీనీ పరిగణిస్తే డీఎంకే గెలవాటానికి అవకాశం ఎక్కువ. స్టాలిన్ కేసీఆర్ గారి మాట కి విలువ నిచ్చే వ్యక్తి. తమిళనాడు లో ఉన్న ఎంపీ సీట్లు అన్నీ కేసీఆర్ వైపే.
కేరళ: కేరళ ని తీసుకుంటే ఎవరో ఒక వ్యక్తి చనిపోతే దానికి కులరంగు, మతరంగు పూచి నాటకాలకి తెరతీసింది బీజేపీ . కేరళ వాళ్ళు పప్పు సుద్దలు కాదు. ఎల్డీఎఫ్ /యూడీఎఫ్ వాళ్లతో కేసీఆర్ కలిస్తే వాళ్ళే అధికారం లోకి వస్తారు. కేరళ లో ఉన్న ఎంపీ సీట్లు అన్నీకేసీఆర్ వైపే.

see also :కేసీఆర్ ఎవరికీ లొంగరు ప్రజలకు తప్ప..!

కర్ణాటక: గాలి జానర్దన్ రెడ్డి దగ్గర్నుంచి యడ్యూరప్ప వరకు ఎలాంటి వారే దేశం అంతా తెలుసు. గుడ్డి లో మెల్ల లాగా కాంగ్రెస్ వాళ్ళు బెటర్ అక్కడ. కానీ జనతాదళ్ కుమార స్వామి గౌడ్ ఒక్కసారి కేసీఆర్ గారిని కలిస్తే జనతాదళ్ వాళ్లదే అధికారం. కర్ణాటక లో ఉన్న ఎంపీ సీట్లు అన్నీ కేసీఆర్ వైపే.సో, సౌత్ ఇండియా అంతా కేసీఆర్ హవా. సింగిల్ సీట్ కూడా మిస్స్ అయ్యే చాన్స్ లేదు.చివర్లో ఒక్క మాట ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వగలిగిన కెపాసిటీ కేసీఆర్ ఒక్కడికే ఉంది. కేసీఆర్ గారే తెచ్చి పెడతారు ఒకవేళ భవిష్యత్ లో వస్తే. ఆల్ రడీ పార్లమెంట్ సాక్షి గా టీఆర్ఎస్ ఎంపీ కవిత గారు ఆంధ్ర కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డీమాండ్ చేశారు. బాబు గంట కో మాట మాట్లాడతడు. లోక్ సభ లో ప్రత్యక హోదా అంటడు, రాజ్య సభ లో ప్రత్యక ప్యాకేజీ అంటడు. బాల క్రిష్ణ అయితే దబ్బిడీదిబ్బిడే. అయితే ప్రత్యేక హోదా విషయం లో బాబు కంటే బాలక్రిష్ణ గారే బెటర్.

see also :Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.!

ఏది ఏమైనా దక్షిణ భారతదేశం అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుంది,ఒకవేళ కేసీఆర్ గారు ప్రధాని అవ్వాలనుకుంటే. దక్షిణ భారతదేశం లో ని ఎంపీ సీట్లు అన్నీ కేసీఆర్ వైపే.మొదటి పార్ట్ లో దక్షిణ భారతదేశం గురించి కేసీఆర్ స్ట్రాటజీ రాశాను. ఇంకా మిగతా భారతదేశం గురించి చూద్దాం.కులం, మతం గురించి మాట్లాడకుండా ఉత్తర భారతదేశ రాజకీయాలని విశ్లేషిస్తే వాడు పిచ్చోడు అయినా అయ్యి ఉండాలి, వెర్రోడు అయినా అయ్యి ఉండాలి. సరే, ఎన్నికలు అనగానే అయోధ్య రామ మందిరం గుర్తుకు వస్తుంది ఉత్తర భారతం లో.ముస్లిం జనాభా 30 కోట్ల కి పైగానే ఉంది. కేసీఆర్ గారికి అది బాగా కలిసి వచ్చే అంశం. కేసీఆర్ గారు ప్రధాని అవ్వాలని అనుకున్న మరుక్షణమే అయోధ్య లో రామ మందిరం ఎలా కట్టాలి అని ఆలోచిస్తాడు. అవసరం అయితే 10 వేల కోట్లు పెట్టి 5 నెలల్లో పూర్తి చేపిస్తాడు. ముస్లిం పెద్దలని పిలిపించి వాళ్ళు అడిగిన 2 ఎకరాలు కాదు, 10 ఎకరాల స్థలం దగ్గర్లో కేటాయించి ప్రపంచం లోనే అతి పెద్ద మసీదు కట్టించ్ ఇస్తాడు. అడక్కపోయినా క్రైస్తవులకి కూడా కొచ్చిన్ లో ఉన్న దానికంటే పెద్ద క్రైస్తవ మందిరం కట్టించి భిన్నత్వం లో ఎకత్వానికి భారతదేశం మరో రూపం అని ప్రపంచానికి చాటి చెప్తాడు. సగం ఖేల్ ఖతం. హిందూ – ముస్లిం గొడవలే ఉండవ్.

see also :”నాడు తండ్రికి.. నేడు కుమారుడికి” – ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాయ్‌..!!

ఉత్తర ప్రదేశ్ మెజార్టీ స్టేక్ ఉంటుంది. అఖిలేశ్ యాదవ్ కి కేసీఆర్ గురువు లాంటి వ్యక్తి, మాట జవ దాటే ప్రసక్తే లేదు. కుల మత సమీకరణాలు కంప్లీట్ అయిపోతాయి కాభట్టి ఉత్తర ప్రదేశ్ సీట్లు అన్నీకేసీఆర్ వైపే.పాపం ఈశాన్య భారత దేశం పరిస్థితి ఘోరం. వాడు వస్తే వీడ్ని తిడతడు. వీడు వస్తే వాడ్ని తిడతడు. కానీ, ఎవరూ ఈ శాన్య భారత ప్రజలని సరిగ్గా ఆదరించలేదు అన్నది జగమెరిగిన సత్యం. కేసీఆర్ గారు ఈ శాన్య భారత ప్రజలకి భరోసా ఇస్తాడు. దాన్ని ప్రపంచం లోనే సుందర ప్రదేశం గా తీర్చి దిద్దుతాడు. ఆ ప్రజల కష్టాలు తీర్చుతాడు. ఈశాన్య భారతం అంతాకేసీఆర్ వైపే.మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వ్యవ్వసాయ ప్రధాన రాష్ట్రాలు. ఎప్పటిలాగే హరీశ్ రావు గారిని దించుతాడు. ప్రతి రాష్టం లో ఏ ప్రాజెక్ట్ కట్టొచ్చో, ఎన్ని లక్షల లేదా కోట్ల ఎకరాలకి నీళ్ళు ఇవ్వొచ్చో హరీశ్ రావు ప్రజలకి చెప్తాడు. వాస్తవానికి మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. హరీశ్ రావు లాంటి వ్యక్తి భారత నీళ్ళ మంత్రి గా ఉంటే మన దేశం ప్రపంచానికే అన్నపూర్ణ అవుతుంది. రాజకీయ పరం గా చూసినా శివ సేన కి బీజేపీ కి పొగసదు. శివ సేన కి మద్దతు ఇస్తే అక్కడ గెలిసేది అదే. సో, ఏ సమీకరణాల ప్రకారం చూసినా ఈ రాష్ట్రాలన్నీకేసీఆర్ గారి వైపే ఉంటై.ఇంకా పశ్చిమ బెంగాల్ ఆల్ రడీ బీజేపీ కి గానీ, కాంగ్రెస్ కి గానీ వ్యతిరేకం. వద్దు అన్నా కేసీఆర్ వెంటే ఉంటారు.జమ్మూ కాశ్మీర్ సున్నితమైన అంశం. ఎంపీ కవిత గారు జమ్మూ సమస్య ని పరిష్కరించగలరు. పోతే హిమాచల్ ప్రదేశ్ ఒక్కటి పోతది కేసీఆర్ గారి నుండి, అంతే.ఢిల్లీ లో కేజ్రీ వాల్ గారిని ముప్పు తిప్పలు పెడుతున్నరు. కేసీఆర్ గారు ఆయనతో మాట్లాడితే ఢిల్లీ, పంజాబ్, హర్యాణా అంతా కేసీఆర్ వైపే.మన దేశ వ్యవసాయానికే కాదు, పరిశ్రమలకి ఎగుమతులకి ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కసారి గూగుల్ లో చూడండి. మనం ఎంత వెనక పడి ఉన్నామో తెలుస్తుంది. కేసీఆర్ గారు ప్రధాని అయితే ప్రపంచం లో ప్రతి దేశానికి మనం దేశం నుంచి ఎగుమతులు ఉంటై.

see also :పట్టుకోకూడని చోట చేతిని తగిలించాడు..! ఆపై ఏం జ‌రిగిందంటే..!!

యుద్ధం అంటూ వస్తే కావల్సింది కండబలం కాదు. చిన్న దేశం సిరియా పరిస్థుతుల వలన 34 దేశాలు అటూ, ఇటూ కాపు కాచుకొని కూర్చున్నై. మనకి పాకిస్థాన్ కి యుద్ధం వచ్చిన, మనకి చైనా కి యుద్ధం వచ్చినా చాల దేశాలు మధ్య లో వస్తై. సో, దేశ సంపద లో సగంకంటే ఎక్కువ గా అనవసరం గా బోర్డర్స్ కి ఖర్చు పెట్టటంకంటే ప్రజలపై పెడదాం అని చైనా, పాకిస్థాన్ వాళ్ళతో మాట్లాడి హౌళా గాళ్ళ లాగా ఎందుకురా బై . యుద్ధం వస్తే ఎవడూ మిగలడూ. దయచేసి ప్రజలు బాగుపడతానికి, మన మన దేశాలు బాగుపడటానికి ఖర్చు చేద్దాం అని ఒప్పించి పాకిస్థాన్ ప్రధానే మన అయోధ్య రామ మందిర ఓపినింగ్ కి రప్పిస్తాడు కేసీఆర్ గారు.విదేశాంగ విధానం లో మార్పు ఉంటుంది. స్వదేశీ టెక్నాలజీ లో మార్పు ఉంటుంది.
హైదరాబాద్ నే ప్రపంచం లో పెద్ద టెక్నాలజీ హబ్ గా చేయటానికి కేటీఆర్ గారు ఉండనే ఉన్నారు. ఇండియన్ హైదరాబాద్ మన సిలికన్ వ్యాలీ అని అమెరికన్లు చెప్పుకోవాలి. కేసీఆర్ గారు ప్రధాని అయిన 4 యేండ్ల లోనే జీడీపీ చాలా పెరుగుతుంది.పార్లమెంట్ నే తలుపులు మూపించి తెలంగాణ తెప్పించినోడి కి అదే పార్లమెంట్ రాజు గా కూర్చోటానికి 3 నెలలు చాలు. దేశానికి అవసరం అయితే వస్తా అన్నారు కేసీఆర్ గారు. నేను వస్తున్నా అని చెప్పలేదు. కేసీఆర్ గారిని అర్దం చేసుకోవాలంటే తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి కనీసం 10 సంవత్సరాలు తపస్సు చేయాలి. ప్రపంచ చరిత్ర లోకేసీఆర్ గారు తయారు చేసినంత మంది నాయకులని ఎవ్వరూ తయారు చేయలేదు. ఏ నాయకుడు అయినా గొప్ప గొప్ప పుస్తకాలు చదివి పాటిస్తాడు, కానీ చాణక్యుడు అర్ధం శాస్త్రం ఇప్పుడు రాస్తే కేసీఆర్ గురించే ఒక అధ్యాయం యాడ్ చేస్తాడు. ఇది కేసీఆర్ కెపాసిటీ, కంటెంట్.ఏది ఎమైనా కేసీఆర్ గారు ప్రదాని అవ్వాలని నిర్ణయించుకుంటే భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది”అని పోస్టు చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat