Home / ANDHRAPRADESH / న‌న్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్

న‌న్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్

2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇత‌ర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. జెఎసి ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమం సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.2019 ఎన్నికలలో తన స్టాండ్ ఏమిటో తెలియచేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.