తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుకూడా ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.మిషన్ కాకతీయ,మిషన్ భాగీరధ,కళ్యాణ లక్ష్మి,ఎకరాకు ఎనిమిదివేల పెట్టుబడి,వ్యవసాయ రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
see also :పక్క రాష్ట్ర సీఎం సంచలన కామెంట్…చూసి నేర్చుకో బాబు
ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఆయన బాద్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా శనివారం వరంగల్ నగరంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా హన్మకొండలోని సుప్రభ హోటల్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.
see also :నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.రాష్ట్రానికి కేసీఆర్ ఒక వరమని కొనియాడారు.సీఎం కేసీఆర్‌తో తనకు మంచి స్నేహ సంబంధం ఉందని చెప్పారు.చంద్రబాబు, బాలకృష్ణ సహకారంతోనే తనకు ఏపీ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం దక్కిందన్నారు.
see also :ఐదున్నర కోట్ల ఆంధ్రులు ఫిదా అయ్యే మాట చెప్పిన కేటీఆర్