ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వేదికగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మరియు అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు.సభలో పవన్ మాట్లాడుతూ..” 2014లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ రూ .15వేలు చేశారు..2019ఎన్నికల్లో మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి…మీ అవినీతిని ప్రోత్సహిచడానికి మద్దతివ్వాల..?లోకేష్ అవినీతికి అవధులు లేవు.లోకేష్ అవినీతి మీ దృష్టికి వచ్చిందో..లేదో తెలియదు.నారా లోకేష్ మాత్రం చాలా దారుణంగా అవినీతికి పాల్పడుతున్నాడని జనసేన అధినేత పవన్ ఫైర్ అయ్యారు.ఏపీ లో మీరు చేస్తున్న అవినీతి పనులకు ఎన్టీఆర్ ఆత్మ క్షోబిస్తుంది..”అని విమర్శలు గుప్పించారు.
” సింగపూర్ లాంటి రాజధాని కావాలంటే..సింగపూర్ లాంటి పరిపాలన కావలి.ఇకపై టీడీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగాడతాం..ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న మిముల్నిఇక ప్రతి రొజూ నిలదిస్తాం ..పర్యావరణం కోసం పోరాడితే ఓ మహిళను 40 రోజులు జైలులో పెడతారా “అంటూ టీ డీ పీ సర్కార్ పై పవన్ మండిపడ్డారు.