ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే.అయితే అధికారంలోకి వచ్చిన నాలుగు యేండ్ల నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రస్టు పట్టించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ
గత నాలుగు ఏండ్లుగా పోరాడుతూనే ఉంది.
తాజాగా గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన తమ మిత్రపక్ష పార్టీ బీజేపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా పలు సంచలనాత్మక విషయాలను తెలిపారు.అసెంబ్లీ సాక్షిగా బీజేపీ నేత విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ పట్టీసీమ ప్రాజెక్టులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ తెలిపింది.
ఇది నిజం కాదా .దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలని ఆయన సవాలు విసిరారు ..చూడాలి మరి గత కొంతకాలంగా ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకుంటున్న బీజేపీ నేతలు ఇంకా భవిష్యత్తులో టీడీపీ అవినీతి అక్రమాలను బయటపెడతారో ..!