Home / NATIONAL / బీజేపీ పార్టీకి సీనియర్ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా ..!

బీజేపీ పార్టీకి సీనియర్ కేంద్ర మాజీ మంత్రి రాజీనామా ..!

బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ,ఆ పార్టీకి చెందిన మొదటితరం నాయకుడు అయిన యశ్వంత్ సిన్హా బీజేపీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు .గత నాలుగు ఏండ్లుగా ఎన్డీఏ సర్కారు అధిపతిగా ,ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ విధానాలు ,నిర్ణయాలు నచ్చకపోవడం వలనే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను .ఇక ఏ రాజకీయ పార్టీలో చేరను ..రాజకీయాల నుండి సన్యాసం తీసుకుంటున్నాను ..

ఇదే ఏడాదిలో జనవరిలో ప్రారంభించిన రాష్ట్ర మంచ్ అనే సంస్థ రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది ..ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద పోరాటాలు చేస్తానని ఆయన ప్రకటించారు ..