Home / Tag Archives: nda

Tag Archives: nda

కేంద్ర సర్కారుపై మంత్రి హారీష్ ఫైర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసినా.. కేంద్రం రైతుల గుండెల్లో బాంబులు వేస్తున్నదన్నారు. తెలంగాణలో మక్క లు బాగా పండాయని, 35 శాతం ధర తగ్గించి విదేశాల నుంచి మక్కలు తెప్పిస్తే, దేశంలో పండించిన మక్కజొన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక …

Read More »

ప్రతి ఒక్కరికి కరోనా టీకా

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో శనివారం ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే టీకాల గురించి ప్రస్తావించారు. వాటి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరు కరోనా వైరస్‌ టీకా కోసం ఎదురుచూస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కంపెనీలు తమ టీకాలకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయని మీకు తెలియజేయాలను కుంటున్నాను. మన నిపుణులు, శాస్త్రవేత్తలు వాటికి …

Read More »

రామమందిరం నమూనా చిత్రాలు మీకోసం

మరి కొద్ది గంటల్లో జరగనున్న రామమందిర నిర్మాణ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ప్రధాని నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది. మూడు అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో …

Read More »

విద్యాసంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ తర్వాత తెరిచే పాఠశాలలు, కళాశాలలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలలు, కళాశాలలకు వేర్వేరు మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది కేంద్రం. కొత్త సీటింగ్‌ ఆరేంజ్‌మెంట్‌, షిఫ్ట్‌ల వారీ తరగతులు ఉండాలని కేంద్రం పేర్కొంది. గ్రంథాలయం, క్యాంటీన్లు, హాస్టళ్లల్లో సరికొత్త పద్ధతులు పాటించాలని వెల్లడించింది. కళాశాలలు, వర్సిటీల్లో కొత్త చేరేవారికి సెప్టెంబర్‌ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. విద్యాలయాల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీతో పాటు క్రీడా కార్యక్రమాలను …

Read More »

అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర జరుగుతుందా..?. త్వరలోనే ఉగ్రదాడులు జరిగే అవకాశముందా..? అంటే అవుననే అంటుంది ఇంటలిజెన్స్ బ్యూరో.. గుజరాత్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా పలువురు మంత్రులపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అహ్మదాబాద్ ,సూరత్ ,వడోదర,రాజ్ కోట్ నగరాల్లో ఈ దాడులు జరగవచ్చు అని హెచ్చరించింది. …

Read More »

సీఏఏకు అందుకే వ్యతిరేకం – మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకం అని ప్రకటించిన సంగతి విదితమే. అయితే సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ లో వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని ప్రాంతాలు ,మతాలు,కులాల కలయిక అని అన్నారు. అలాంటప్పుడు ఈ బిల్లుతో ఏమి అవసరం వచ్చింది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఏఏ ప్రజల …

Read More »

NRC పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

ఎన్ఆర్సీ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్యాలలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడ బడితే అక్కడ పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఆర్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ …

Read More »

3ప్రధానాంశాలతో కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం

Read More »

సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …

Read More »

బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?

బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.

Read More »