కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రం విశ్వరూపం పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జోడీగా పూజాకుమార, ఆండ్రియా నటిస్తున్నారు. చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. తెలుగుతోపాటు, హింది, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలకు రెడీ అయింది.
see also::విడాకులపై మంచు మనోజ్ స్పందన ఇదే..!!
జూన్ 11వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు విశ్వరూపం – 2 చిత్రం ట్రైలర్ విడుదల కానుందని, ఇక్కడ విచిత్రమేమిటంటే.. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. హిందీ వర్షన్‌లో అమీర్ ఖాన్, తెలుగు వర్షన్‌లో ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.
see also:నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!