ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు .అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారా లేదా ..ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకొని తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు .
see also:బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఆత్మహత్య
ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనను కాదని ఇతర పార్టీ నుండి వచ్చిన నేతకు టికెట్ ఇవ్వడంతో తను బరిలో నుండి తప్పుకున్న వైజాగ్ అర్భన్ టీడీపీ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ సీనియర్ నేత కోన తాతారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో మిస్ అయిన కానీ ఈ సారి ఎన్నికల్లో అయిన గాజువాక స్థానాన్ని ఇవ్వాలని తాతారావు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ్ని పలు మార్లు కోరారు అంట .
see also:వైసీపీలోకి టీడీపీ కీలక నేత..!
అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదు అని నీకు ఇవ్వడం కష్టమని తేల్చేశాడు చంద్రబాబు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తాతారావు పార్టీకోసం ఎప్పటి నుండో కష్టపడుతున్న ..కష్టాల్లో అండగా ఉన్న తనని కాదని పదవుల కోసం పార్టీ మారిన వారిని అందలం ఎక్కించడంపై తీవ్ర అవమానంగా భావించిన తాతారావు అనుచవర్గంతో సహా వైసీపీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు .అయితే జిల్లాలో మంచి పట్టున్న తాతారావు వైసీపీలో చేరితే టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు ..