వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాముసైతం అంటూ ప్రజలు నడుస్తున్నారు. టీడీపీ హయాంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలన జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పింఛన్లు ఇచ్చేందుకు కూడా జన్మభూమి కమిటీలు లంచం అడుగుతున్నారని వృద్ధులు, తమ రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి చివరకు తమను చంద్రబాబు మోసం చేశారని డ్వాక్రా మహిళలు, రైతులు, అలాగే, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు ఇలా వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
see also:జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వారసుడు..!
ఇదిలా ఉండగా, జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సర్వే సంస్థలు సైతం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే సంకేతాలు కూడా ఇచ్చేశాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది.
see also:చంద్రబాబుకి దిమ్మతిరిగే సర్వే.. వైసీపీలో గెలిచి ..టీడీపీలోకి జంప్ అయిన 22 మందిలో 20 మంది ఓటమి
కాగా, ఇవాళ విశాఖపట్నం జిల్లా కేంద్రంలో వైసీపీలోకి వలసల పర్వం కొనసాగింది. 40 మంది వైసీపీలో చేరారు. మరో పక్క ఇప్పటికే పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలతోపాటు, ఆదివారం తూర్పు గోదావరిజిల్లాలో జగన్ సమక్షంలో 800 మంది కాపు నాయకులు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా జగన్ పాదయాత్ర నేపథ్యంలో వైసీపీలోకి వలసలు పర్వం కొనసాగుతోంది.