ఏపీ కి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ.. డిమాండ్ల కోసం ఢిల్లీలో మకాం వేసిన ఏపీ టీడీపీ ఎంపీలు తమ పరువును తామే తీసేసుకున్నారు. ఈ డిమాండ్లను ఎంపీలందరు ఘోరంగా కించపరిచారు.
see also:వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముఉంది..వైఎస్ జగన్
పిచ్చాపాటీగా మాట్లాడుతూ అసలురంగును బయటపెట్టుకున్నారు. భేటీలో పాల్లొన్న వారిలో ఒకరు ఈ పాడు ముచ్చను వీడియో తీసి నెట్లో పెట్టడంతో బండారం బయటపడింది.
నిరాహార దీక్షపై మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘నాకు ఐదు కేజీల బరువు తగ్గాలని ఉంది.. అవకాశమిస్తే వారం రోజులు దీక్ష చేస్తా..’ అన్నాడు. విశాఖ రైల్వే జోన్ పై అవంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘జోనూలేదు… బోనూలేదు‘ అని అన్నారు. దివాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు అవేవో జోకులన్నట్లు పగలబడి నవ్వుతున్నారు. ఏపీ ప్రయోజనాలపై ఈ ఎంపీల చిత్తశుద్ధిని తెలిపే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీకోసం..