ఇటీవల కాలంలో చాలా మంది నటీమణులు వెండి తెరపై ఏదైనా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడుతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ రష్మికా మందన క్రికెటర్‌గా కనిపించబోతోంది. అలాగే, సూర్య అనే బాలీవుడ్ సినిమా కోసం హాకీ బ్యాట్ చేతబట్టింది తాప్సీ.
see also:పందిపిల్లతో రవిబాబు పుషప్స్..!
వారితో పోల్చితే నేనేం తక్కువ కాదంటోంది సాయిపల్లవి. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రను సాయి పల్లవి చేస్తోంది. అదే ఫుట్ బాల్ క్రీడాకారిణి పాత్ర. హీరో శర్వానంద్‌తో ప్రముఖ దర్శకుడు హనురావికూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో పడి పడి లేచే మనసు చిత్రంలో సాయి పల్లవి ఫుట్‌బాల్ క్రీడాకారిణి పాత్రలో కనిపించబోతోందట సాయి పల్లవి. ఈ చిత్రంతో ఓ కొత్త ప్రేమ కథను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో సాయి పల్లవి నిజంగానే ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కనిపించబోతోందా..? లేదా..? అన్న విషయం తెలియాలంటే టీజర్ కోసం వేచి చూడక తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు.